ప్రేమమైకంలో తెలుతున్న ప్రభాస్‌, పూజ

ప్రేమమైకంలో తెలుతున్న ప్రభాస్‌, పూజ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధే శ్యామ్’. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామ నేపథ్యంలో దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ రోమాంటిక్‌ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. కాగా ఇప్పటికే మూవీ నుంచి ప్రభాస్‌-పూజలకు సంబంధించిన పలు రోమాంటి సన్నివేశాలకు సంబంధించిన పోస్టర్లను చిత్ర యూనిటి విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. వీటికి ప్రేక్షకులను నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా హీరో ప్రభాస్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఈ మూవీ నుంచి మరో పోస్టర్‌ను విడుదల చేశాడు‌.

ఈ పోస్టర్‌ ప్రభాస్‌, పూజ హెగ్డెలు మంచులో పడుకుని ప్రేమమైకంలో తెలుతున్నట్లుగా కనిపిస్తున్నారు. ప్రభాస్‌ షేర్‌ చేసిన ఈ రోమాంటిక్‌ లుక్‌ అందరిని తఆకట్టుకుంటోంది. ‘కొందరు దీనిని పిచ్చి అంటారు.. మేం మాత్రం ప్రేమ అంటాం.. ఈ ప్రేమకథ మీ హృదయాలలో ఎప్పటికీ నిక్షిప్తమై ఉంటుంది‘ చిత్ర యూనిటి ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. కాగా రాధేశ్యామ్‌లో ప్రభాస్‌ సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఓ రొమాంటిక్ పాత్రలో ప్రభాస్ అభిమానులను ఆకట్టుకోనున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న రాధేశ్యామ్‌ పలు భాషల్లో జులై 30న విడుదల కానుంది.