రజినీకాంత్ ని “ఢీ” కొట్టనున్న రాఘవ లారెన్స్ ?

రజినీకాంత్ ని “ఢీ” కొట్టనున్న రాఘవ లారెన్స్ ?
Cinema

ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ మధ్యనే నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన జైలర్ తో సాలిడ్ హిట్ ని కొట్టాడు. తాజాగా రజినీకాంత్ మరో సినిమాలో నటించే ప్లాన్ లో ఉండిపోయాడు . ఇటీవల విజయ్ తో తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “లియో” తో ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను దక్కించుకుంది, ఈ సినిమాను తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ తర్వాత సినిమా రజినీకాంత్ తో తీయనున్నాడు. ఈ సినిమా చర్చల దశలో ఉండగా ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారిపోయింది . రజినీకాంత్ ను ఢీ కొట్టే విలన్ పాత్రలో నటించడానికి రాఘవ లారెన్స్ ను తీసుకోవడానికి చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది .

రజినీకాంత్ ని  “ఢీ” కొట్టనున్న రాఘవ లారెన్స్ ?
Rajinikanth, Raghava Lawrence

ఈ మూవీ షూటింగ్ ను త్వరలోనే సెట్స్ పైకి తీసుకువెళ్లనుండడంతో ఈ విషయంపైన అధికారికంగా తెలియాల్సి ఉంది. కాగా రజినీకాంత్ టి జ్ఞానవేల్ రాజా తో ఒక సినిమా ని చేస్తున్నారు. మరి రజినీకాంత్ తో లారెన్స్ విలన్ గా చేస్తారా ? అన్నది తెలియాల్సి ఉన్నది