రాజ్ తరుణ్ సంచలన తీసుకున్న నిర్ణయం

రాజ్ తరుణ్ సంచలన తీసుకున్న నిర్ణయం

హీరో రాజ్ తరుణ్ కెరిర్ ఆరంభంలో వరుస హిట్‌లు అందుకున్నా, ఈ మధ్య కాలంలో మాత్రం ఒక్క హిట్ కూడా అందుకోలేకపోతున్నాడు. అయితే తాజాగా రాజ్ తరుణ్ హీరోగా చేసిన ఇద్దరి లోకం ఒకటే సినిమా కూడా సక్సెస్ కాకపోవడంతో విసిగిపోయిన రాజ్ తరుణ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. చిన్న సినిమాలలో ఎక్కువగా నటించే రాజ్ తరుణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.

అయితే ఆయన నటిస్తున్న సినిమాలకు ఈ మధ్య సక్సెస్ టాక్ వినిపించకపోవడంతో ఆ సినిమాలను కూడా వదులుకున్నట్టు తాక్ వినిపిస్తుంది. అయితే సురేశ్ బాబు నిర్మాతగా తెరకెక్కిస్తున్న డ్రీమ్ గర్ల్ తెలుగు వెర్షన్ రీమేక్ సినిమా నుంచి కూడా రాజ్‌తరుణ్ తప్పుకున్నాడట. అయితే ఈ చిత్రం ట్రయ‌ల్‌ షూట్‌తో పాటు షెడ్యూలింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇలాంటి తరుణంలో రాజ్ తరుణ్ ఈ సినిమా నుండి తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే డ్రీమ్ గర్ల్ ఒరిజినల్ వెర్షన్ లో హీరో పాత్ర లేడీ వాయిస్ తో ఉండడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అలాంటి సాహసం చేయలేకనే రాజ్ తరుణ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం. అయితే కాస్త విరామం తీసుకొనైనా మంచి హిట్ కొట్టాలనే రాజ్‌తరుణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడన్న చర్చ వినిపిస్తుంది.