మహేశ్ బాబు మూవీకి రాజమౌళి పెట్టిన ముహూర్తం అదే…

మహేశ్ బాబు మూవీకి రాజమౌళి పెట్టిన ముహూర్తం అదే...
mahesh rajamouli

మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ను ఇటీవలే ఖరారు చేశారు. ఈ టైటిల్ కి మహేశ్ ఫ్యాన్స్ నుంచి స్పందన లభించింది ప్రెసెంట్ ఈ మూవీ షూటింగు హైదరాబాద్ లో జరుపుకుంటుంది. సంక్రాంతి బరిలోకి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఐతే ఈ సినిమా తరువాత మహేశ్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే. RRR ‘ సినిమాను ఆస్కార్ వేదిక పైకి తీసుకెళ్లిన రాజమౌళి, ఇక మహేశ్ మూవీ ఎలా తీయబోతున్నాడు అనే ఆసక్తి అందరిలో ఉంది. విజయేంద్రప్రసాద్ టీమ్ తో కలిసి కథపై ఒక రేంజ్ లో కసరత్తు జరుగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ కావడానికీ .. ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా చాలా టైం పడ్తుంది. కగా వచ్చే ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు స్టార్ట్ ఆయె అవకాశం కనిపిస్తుంది. అయితే ఆగస్టు 9వ తేదీన మహేశ్ బాబు బర్త్ డే కావడంతో, ఆ రోజున అధికారికంగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది. తన కొత్త సినిమాల ఓపెనింగ్స్ కి వచ్చే అలవాటు లేని మహేశ్బాబు, రాజమౌళి సినిమా ఓపెనింగ్ కి మాత్రం రావాల్సి ఉంటుందనే వార్త సోషల్ మీడియా లో బాగానే వినిపిస్తోంది.