గుడ్‌ ఛాయిస్‌ శివానీ.. ఆల్‌ ది బెస్ట్‌

rajashekhar daughter signs 2 states
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్‌ కూతురు శివానీ హీరోయిన్‌గా పరిచయం కాబోతుందని గత రెండు మూడు సంవత్సరాలుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదట ఆ వార్తలను కొట్టి పారేసిన జీవిత రాజశేఖర్‌ ఆ తర్వాత ఒప్పుకున్నారు. ఇటీవలే ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన శివానీ హీరోయిన్‌గా రాబోతున్నట్లుగా ‘గరుడవేగ’ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో స్వయంగా రాజశేఖర్‌ మరియు జీవితలు ప్రకటించారు. దాంతో పాటు శివానీ కూడా తాను కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాను, ఆశీర్వదించండి అంటూ కోరింది. దాంతో శివానీ హీరోయిన్‌గా ఎంట్రీ ఫిక్స్‌ అయ్యింది. అయితే శివానీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా ఏంటీ అనే విషయంపై గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతుంది.

శివానీ నటించబోతున్న సినిమాపై క్లారిటీ వచ్చేసింది. హిందీలో సూపర్‌ హిట్‌ అయిన ‘2 స్టేట్స్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు. హిందీలో అర్జున్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో హీరోగా అడవి శేషు నటించబోతున్నాడు. ఇక హీరోయిన్‌గా ఆలియా భట్‌ స్థానంను శివానీ భర్తీ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. వెంకట్‌ రెడ్డి అనే సహాయ దర్శకుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

వినాయక్‌ వద్ద చాలా కాలంగా సహాయ దర్శకుడిగా వర్క్‌ చేసిన వెంకట్‌ రెడ్డి ఈ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి చేయగలడు అనే నమ్మకంను అడవి శేషు ఉంచాడు. తెలుగులో ‘2 స్టేట్స్‌స్‌’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అని, మొదటి సినిమాతోనే శివానీకి మంచి పేరు వస్తుందని రాజశేఖర్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ నమ్మకంగా ఉన్నారు. హిందీలో సూపర్‌ హిట్‌ అయ్యింది కనుక తొగులో కాస్త జాగ్రత్తగా తీస్తే తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. నార్త్‌ ఇండియా అమ్మాయి, సౌత్‌ ఇండియా అబ్బాయిల మద్య ప్రేమ వ్యవహారం ఈ చిత్రం కథ.