రజనీకాంత్ ఇంట తీవ్ర విషాదం !

rajinikanth's brother wife kalavathi passed away

నటుడు రజనీకాంత్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది. రజనీకాంత్ అన్నయ్య సత్యనారాయణన్‌ భార్య కళావతి బాయి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 70 సంవత్సరాలు. ఆమె బెంగళూరులోని తమ స్వగృహంలో మరణించడంతో అంత్యక్రియల కోసం రజనీకాంత్‌ తన కుటుంబ సభ్యులతో సహా నిన్న బెంగళూర్‌ వచ్చారు.

 kalavathi  passed away

కళావతిబాయి గత కొంత కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. బెంగళూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె వైద్యం ఫలించక ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. నిన్న సాయంత్రం బెంగళూర్‌లో ఆమె అంత్యక్రియలు జరిగాయి. రజనీకాంత్‌ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో అన్నయ్య సత్యనారాయణన్, వదిన కళావతి వద్దే పెరిగారు.

rajinikanth