యోగా చేస్తున్న ఫోటోను త‌న తాజాగా ఇన్‌స్ట్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన రకుల్

యోగా చేస్తున్న ఫోటోను త‌న తాజాగా ఇన్‌స్ట్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన రకుల్

టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ చూడ‌టానికి ఎంత అందంగా కనిపిస్తారో అంతే ఫిట్‌గా ఉంటారు. ఫిట్‌నెస్‌పై ర‌కుల్‌కు ఉన్న శ్ర‌ద్ధ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. నిత్యం వివిధ ర‌కాల యోగాసనాలు, జిమ్‌లో వ‌ర్కౌట్లు చేస్తున్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఆరోగ్యంగా ఉండ‌టం ఎంత అవ‌స‌ర‌మో తెలియ‌జేస్తూ ఉంటారు. యోగా చేస్తున్న ఓ ఫోటోను త‌న తాజాగా ఇన్‌స్ట్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. అయితే ఇది ఇప్ప‌టి ఫొటో కాదు. ఆమె చిన్న‌ప్ప‌టి ఫోటో. 1993 అంటే త‌నకు మూడేళ్ల వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు తీసుకున్న ఫొటోను అభిమానుల‌తో పంచుకున్నారు.

1993 నుంచి యోగా సాధన చేస్తున్నాను అనే క్యాప్ష‌న్‌తో షేర్ చేసిన ఈ ఫోటోను చూస్తుంటే ర‌కుల్‌కు యోగాపై చిన్న‌నాటి నుంచి ఎంత ఆస‌క్తి ఉంద‌నే విష‌యం అర్థ‌మ‌వుతోంది. లాక్‌డౌన్‌లో షూటింగ్‌లు లేక‌పోవ‌డంతో స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా వినూత్న రీతిలో యోగాసానాలు వేస్తూ అభిమానుల‌ను అల‌రించిన విష‌యం తెలిసిందే. ఇక లాక్‌డౌన్‌లో ముంబైలో కుటుంబంతో సరదాగా గడిపిన రకుల్‌.. వంటలు చేస్తూ, సినిమాలు చూస్తూ, వర్కౌట్స్‌తోనూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇటీవ‌ల ర‌కుల్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన‌ కొన్ని యోగాసానాల ఫోటోల‌ను ఈకింద చూడ‌వ‌చ్చు.