బ్రేక్‌ ఇస్తున్నారా..? నువ్వు తీసుకుంటున్నావా?

Rakul Takes Break From Movies

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం చేతిలో ఆఫర్లు లేక విలవిలలాడిపోతుంది. గత సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం ఈమె స్టార్‌ హీరోలకు సైతం డేట్లు లేవు అంటూ చెప్పిన సందర్బాలు ఉన్నాయి. కాని ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈమె డేట్లు మొత్తం ఖాళీగానే ఉన్నాయి. చిన్న చిత్రాలను చేయాలంటే కాస్త ఇబ్బందిగా ఫీల్‌ అవుతున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెద్ద సినిమాల్లో ఛాన్స్‌లు లేకపోవడంతో ఓపెనింగ్స్‌కు, ఫొటో షూట్స్‌కు టైం కేటాయిస్తుంది. తాజాగా ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించేందుకు ఈమె ఓకే చెప్పింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఎన్టీఆర్‌ చిత్రంలో ఈమె నటిస్తున్న కారణంగా మళ్లీ ఫామ్‌లోకి వస్తుందేమో అని అంతా ఎదురు చూస్తున్నారు.

Rakul--Movies

తాజాగా మీడియాతో మాట్లాడుతూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాను సినిమాలకు కాస్త గ్యాప్‌ తీసుకోవాలని భావిస్తున్నాను. ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత కనీసం సంవత్సరం పాటు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. రకుల్‌ సినిమాలకు బ్రేక్‌ తీసుకోవాలనుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఆమెకు ఛాన్స్‌లే లేవు. ఇలాంటి సమయంలో ఆమె సినిమాలకు దూరంగానే ఉంటుంది. అయినా మళ్లీ సినిమాలకు బ్రేక్‌ తీసుకోవాలనుకుంటున్నా, కొన్నాళ్లు సినిమాలను వదిలి పెట్టాలనుకుంటున్నా అంటూ చెప్పడం ప్రేక్షకులను మోసం చేయడమే అని చెప్పుకోవచ్చు. సినిమాల్లో ఆఫర్లు ఉన్న సమయంలో ఏ ఒక్కరు కూడా బ్రేక్‌ తీసుకోవాలని కోరుకోరు. రకుల్‌ తీసుకోబోతున్న బ్రేక్‌ ఆమె స్వయంగా తీసుకుంటున్నది కాదు. మళ్లీ నటించాలని కోరుకుంటున్న ఈమెకు ఛాన్స్‌లు దక్కేనా లేదో చూడాలి.

Rakul-movies