రామ్ – బోయపాటి “స్కంద” సినిమా సెన్సార్ పూర్తి

రామ్ – బోయపాటి “స్కంద” సినిమా సెన్సార్ పూర్తి
Movie News

బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, యంగ్ బ్యూటీ శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన తాజా సినిమా స్కంద. ఈ భారీ పాన్ ఇండియా సినిమా ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ సినిమా కి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా పలు భాషలలో ఆడియన్స్ ముందుకి రానుంది.

రామ్ – బోయపాటి “స్కంద” సినిమా సెన్సార్ పూర్తి
Skandha

ఈ నేపథ్యంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్లు జోరుగా జరుపుతుంది చిత్ర యూనిట్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ మూవీ పై విపరీతమైన హైప్ ని క్రియేట్ చేశాయి. శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ ఈ సినిమా లో పలు కీలక పాత్రలు పోషించారు. ఇక ఐటెం సాంగ్ లో ఊర్వశి రోటేలా కల్ట్ మామ పాటకు స్టెప్పులేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది.