మంత్రి పేర్ని నానితో వర్మ సమావేశం

మంత్రి పేర్ని నానితో వర్మ సమావేశం

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏపీ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిసేందుకు ఈ రోజు అమరావతికి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రితో వర్మ భేటీ ముగిసింది. అనంతరం వర్మ మీడియాతో ముచ్చటించాడు.ఈ మేరకు వర్మ మాట్లాడుతూ.. ‘మంత్రి పేర్ని నానితో సమావేశం సంతృప్తి నిచ్చింది.

ఆయనతో మాట్లాడాక నేను కూడా 100 శాతం సంతృప్తి చెందాను. టికెట్ల విషయంలో నా ఆలోచనలను మంత్రికి వివరించా. ప్రభుత్వ ఆలోచనలను మంత్రి కూడా నాకు వివరించారు. నేను కేవలం నా ఆలోచనలను మాత్రమే చెప్పడానికి వచ్చాను. వీటిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.