కొద్ది రోజుల నుంచి సైలెంట్‌గా ఉన్న రామ్ గోపాల్ వర్మ

కొద్ది రోజుల నుంచి సైలెంట్‌గా ఉన్న రామ్ గోపాల్ వర్మ

వివాదస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తీయబోయే సినిమాకు బ్రేక్ పడింది. ఇటీవల ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరింత వార్తలలో నిలిచిన ఆర్జీవీ కొద్ది రోజుల నుంచి కాస్త సైలెంట్‌గానే ఉన్నాడు. అయితే ఆర్జీవీ ఈ సినిమా తీసే సమయంలోనే ఈయనపై ఒక సినిమా తీస్తామని కొందరు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా టైటిల్‌ను ఋఘ్వ్ (ఒక సైకో బయోపిక్)గా అనుకున్నారు. అయితే ఈ టైటిల్‌తో సినిమా తీసేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ అనుమతి నిరాకరించింది. ఈ మేరకు అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ పేరుతో సినిమా తీయడానికి దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ పేరు కావడం చేత వీలు పడదని తేల్చి చెప్పారు. ఒక వేళ ఇదే టైటిల్‌తో సినిమా తీయాలని అనుకుంటే రామ్ గోపాల్ వర్మ దగ్గరి నుండి నో అబ్జెక్షన్ తీసుకోవాలని, అది ఛాంబర్ వారికి అందించాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో వర్మ పేరుకున్న పవర్ అంటే ఇదే అని ఆయన అభిమానులు తెగ మురిసిపోతున్నారట.