ఎన్టీఆర్ న‌న్ను అభినందిస్తున్నారు…

RGV says NTR congratulating me on my film on him in FB

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్ర‌క‌టించిన ద‌గ్గ‌ర‌నుంచి… ఆ సినిమాను ఏదో ఒక రూపంలో వార్త‌ల్లో నిలిపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు రాంగోపాల్ వ‌ర్మ‌. గ‌తంలో త‌న సినిమాల‌కు సంబంధించి ఏదో ఒక వివాదం రేకెత్తించి, దానిపై టీవీ చాన‌ళ్లో చ‌ర్చా కార్య‌క్ర‌మాలు జ‌రిగేలా చూసి, ఆ చ‌ర్చ‌ల్లో స్వ‌యంగా పాల్గొని షూటింగ్ కు ముందే సినిమాకు కావ‌ల్సినంత ప‌బ్లిసిటీ తెచ్చుకునేవారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ విష‌యంలో మాత్రం ప‌బ్లిసిటీ కోసం సోష‌ల్ మీడియాను ఉప‌యోగించుకుంటున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఏర‌క‌మైన విమ‌ర్శ వ‌చ్చినా ఫేస్ బుక్ వేదిక‌గానే స్పందిస్తున్నారు.

సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, అనిత వంటి టీడీపీ నేత‌ల‌తో పాటు… అల‌నాటి హీరోయిన్ వాణీ విశ్వ‌నాథ్ చేసిన విమ‌ర్శ‌ల‌కు ఫేస్ బుక్ లోనే స‌మాధాన‌మిచ్చారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ గురించి అతిగా స్పందించ‌వ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు పార్టీ నేత‌ల‌కు సూచించాక‌… వారు సైలెంట్ అయ్యారు. దీంతో సినిమాను ఎలాగోలా వార్త‌ల్లో ఉంచేందుకు ఎన్టీఆర్ ఆత్మ త‌న‌కు రోజూ క‌ల‌లోకి వ‌స్తోంద‌ని, ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ రాయ‌డానికి ఆయ‌న ఆత్మ స‌హ‌క‌రిస్తోందని వ‌ర్మ హాస్యాస్ప‌ద వ్యాఖ్య‌లుచేశారు. సినిమాకు ప‌బ్లిసిటీ కోస‌మే వ‌ర్మ ఇలా చేస్తున్నార‌ని ప్ర‌తి ఒక్క‌రికి తెలుసు.

తాజాగా త‌న ఫేస్ బుక్ ఖాతాలో వ‌ర్మ ఓ ఫొటోను అప్ లోడ్ చేశారు. ఓ కార్య‌క్ర‌మంలో వ‌ర్మ‌కు ఎన్టీఆర్ షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటో ఇది. ఈ ఫొటోలోనే ఇంకో చిన్న ఫొటో కూడా ఉంది. ఎన్టీఆర్ ల‌క్ష్మీపార్వ‌తి దండ‌లు మార్చుకుంటుండ‌గా… చంద్ర‌బాబు వారి వెన‌క నిల్చుని ఉన్నారు. తాను, ఎన్టీఆర్ క‌లిసి ఉన్న ఫొటోకు వ‌ర్మ త‌న‌పై సినిమా తీస్తున్నందుకు న‌న్ను ప్ర‌శంసిస్తు్న్న ఎన్టీఆర్ అని క్యాప్ష‌న్ పెట్టారు. ఫొటోపై ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అని ఇంగ్లీష్ లో రాసి ఉంది.