మొన్న బాహుబ‌లి… ఇప్పుడు రియ‌ల్ మెగాస్టార్

Ram Gopal Varma says Revanth reddy Real Megastar of Congress

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలంగాణ లో ఫైర్ బ్రాండ్ నేత‌గా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డికి వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ పెద్ద ఫ్యాన్ లా క‌నిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేర‌డంపై స్పందిస్తూ… రేవంత్ రెడ్డి చేరిక త‌ర్వాత కాంగ్రెస్ పై త‌న‌కు న‌మ్మ‌కం వ‌చ్చింద‌ని వ‌ర్మ వ్యాఖ్యానించారు. రేవంత్ ను కాంగ్రెస్ బాహుబ‌లిగా అభివ‌ర్ణించారు. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

వాటికి రియ‌ల్ మెగాస్టార్ ఆఫ్ కాంగ్రెస్ అనే టైటిల్ కూడా పెట్టారు. బాస్ ఈజ్ హియ‌ర్ అనేట్యాగ్ లైన్ జ‌త‌చేశారు. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 పోస్ట‌ర్ల‌ను మార్ఫింగ్ చేసి చిరంజీవి ముఖం స్థానంలో రేవంత్ రెడ్డి ఫేస్ చేర్చారు. వ‌ర్మ పోస్ట్ చేసిన ఈ పోస్ట‌ర్లు నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి. రాజ‌కీయాలపై ఎప్పుడూ అంత‌గా స్పందించ‌ని వ‌ర్మ రేవంత్ రెడ్డి విష‌యంలో మాత్రం ఆయ‌నకు అనుకూలంగా పోస్టులు చేస్తున్నారు. వ‌ర్మ కూడా అంద‌రిలానే… రేవంత్ రెడ్డి తెలంగాణ‌లో కాంగ్రెస్ భ‌విష్య‌త్తును మారుస్తారనే విశ్వాసం వ్య‌క్తంచేస్తున్నారు.

Revanth reddy is Bahubali

Revanth reddy real megastar