మళ్ళీ విధుల్లోకి రమణ దీక్షితులు…జగన్ హామీ ?

ramana presents again into duty

గత సంవత్సరం మే16 న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశమై, 65 ఏళ్లకు పైబడిన అర్చకులకు పదవీ విరమణ విధానాన్ని వర్తింపజేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుతో పాటు 15 మంది మిరాశీ, సంభావన అర్చకులు విధుల నుంచి తొలగించబడ్డారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన పలువురు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. తాము అధికారంలోకి వస్తే, రిటైర్ మెంట్ విధానాన్ని రద్దు చేస్తామని, అర్చకులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా వైసీపీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. వైఎస్ జగన్ సైతం ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు పార్టీ నేతలు అంటున్నారు. సాధ్యమైనంత త్వరలో పాత సర్కారు నిర్ణయాలను జగన్ సమీక్షిస్తారని, అన్ని వర్గాలకూ న్యాయం జరిగే నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు.  దీంతో తిరుమలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవాలయాలన్నింటిలోనూ ఉన్న సమస్యలను జగన్ సర్కారు పరిష్కరిస్తుందని అర్చకులు, మిరాశీలు అభిప్రాయపడుతున్నారు. దీంతో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు తిరిగి విధుల్లో చేరనున్నారని అంటున్నారు.