రాహుల్ జాతకం మార్చి రాసిన హీరోయిన్.

Ramya Is Helping Rahul Gandhi to lead in Gujarat elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గుజరాత్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎదుర్కొన్న ప్రధాన సమస్య తాను ఆన్ లక్కీ అని అప్పటికే పడ్డ బ్రాండ్. పప్పుగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో సాగిన ప్రచారం. ఇవన్నీ నిజానికి పెద్ద సమస్యలు కాకపోయినా అపజయాల్లో ఉన్న వ్యక్తి మానసిక స్థైర్యాన్ని ఇంకాస్త దెబ్బ తీస్తాయి. అదే సమయంలో ప్రధాని మోడీ సొంత గడ్డ, బీజేపీ కంచుకోట అయిన గుజరాత్ లో ఎన్నికలు. ఇక కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధికారికంగా అధిష్టించాల్సిన పరిస్థితి. వీటన్నిటి నుంచి రాహుల్ మీద ఒత్తిడిని దూదిపింజలా తీసేసింది మాత్రం ప్రముఖ కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య.

rahul-gandhi-and-ramya

సోషల్ మీడియా విభాగంలో బీజేపీ దూకుడుకి తట్టుకోలేకపోయిన కాంగ్రెస్ డిజిటల్ ప్రచారాన్ని ఆమె కొత్త పుంతలు తొక్కించారు. డిజిటల్ ప్రచార బాధ్యతలని తీసుకున్న వెంటనే ఆమె ఓ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లారు.ముందుగా రాహుల్ వీరుడు అని చెప్పే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. మోడీ పగ్గాలు చేపట్టాక తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పధకాల వల్ల జరుగుతున్న నష్టానికి విస్తృత ప్రచారం కల్పించారు. అప్పటి దాకా సోషల్ మీడియాలో ఆఫెన్స్ తప్ప డిఫెన్స్ తెలియకుండా రెచ్చిపోతున్న బీజేపీ తొలిసారిగా రక్షణాత్మక ఆట ఆడాల్సిన పరిస్థితి కల్పించారు. మోడీ అండ్ కో రాహుల్ మీద దాడి మాట అటుంచి మోడీ అండ్ కో నిర్ణయాల మీద వివరణలకే పరిమితం అయ్యేలా చేశారు.

actress-ramya-helpson-rahul
గుజరాత్ ఎన్నికల ప్రచార పర్వంలోను రమ్య టీం పైన చెప్పుకున్న ఫార్ములానే నమ్ముకుంది. దీంతో ప్రధాని మోడీ సైతం తన నిర్ణయాల వల్ల ఇప్పుడు ఇబ్బందులు ఎదురైనా భవిష్యత్ బాగుంటుందని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చాక కొద్దిలో విజయం చేజారడం వల్ల ఎవరైనా నిరాశకు గురి అవుతారు. కానీ రమ్య టీం నిరాశ అనే మాట లేకుండా వచ్చిన ఫలితాలతోనే రాహుల్ ఇమేజ్ పెంచారు. ఫలితాలను నిశితంగా విశ్లేషించి ఓ పది సీట్లు అటు ఇటు అయితే మోడీ కి ఎదురు దెబ్బ తగిలేదన్న విషయాన్ని దేశమంతటా విస్తృతంగా ప్రచారం చేయగలిగారు. జనం దాన్ని నమ్మేలా చెప్పగలిగారు. దీంతో మరో పరాజయం వచ్చినప్పటికీ రాహుల్ ని పప్పు అనే సాహసం బీజేపీ వాళ్ళు కూడా చేయలేకపోయారు. పైగా బీజేపీ లో యోధానుయోధులంతా మూకుమ్మడిగా వచ్చినా ఒంటి చేత్తో కాంగ్రెస్ గౌరవాన్ని నిలబెట్టాడని, పోరాట వీరుడని అంతా ప్రశంసిస్తున్నారు. ఈ విషయంలో రాహుల్ జాతకాన్ని మార్చింది రమ్య అని చెప్పుకోవడానికి ఆలోచించాల్సిన పనే లేదు.

rahul-gandhi-latest-news