ర‌మ్య‌కృష్ణ‌ స్థానంలో ర‌వీనాటాండ‌న్

ర‌మ్య‌కృష్ణ‌ స్థానంలో ర‌వీనాటాండ‌న్

సౌత్ ఇండియానే కాదు, బాలీవుడ్ ని సైతం కుదిపేసింది కేజీఎఫ్‌. అస‌లు ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సంచల‌నాలు సృష్టించింది. ఇప్పుడు కేజీఎఫ్ 2 కూడా ఇంకా గ్రాండ్‌గా ముస్తాబ‌వుతోంది. సంజ‌య్‌ద‌త్ లాంటి స్టార్ల‌ను తీసుకొచ్చి ఈ సినిమాకి కొత్త సొగ‌సుల్ని అద్ద‌డానికి ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నిస్తున్నాడు. తాజాగా ర‌వీనాటాండ‌న్ కూడా సెట్లోకి అడుగుపెట్టింది. నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా ర‌మ్య‌కృష్ణ‌ని సంప్ర‌దించార‌ని తెలుస్తోంది. ఆమెకు క‌థ‌, త‌న పాత్ర న‌చ్చినా… పారితోషికాన్ని భారీగా డిమాండ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎంత బేరాలాడినా – ఏమాత్రం త‌గ్గించ‌డానికి ర‌మ్య‌కృష్ణ ఒప్పుకోలేద‌ట‌. అందుకే ఆమె స్థానంలో ర‌వీనాని ఎంచుకున్నారు. `బాహుబ‌లి` తర‌వాత ర‌మ్య‌కృష్ణ క్రేజ్ విప‌రీతంగా పెరిగింది. అయితే ఆ స్థాయిలో ఆమెకు అవ‌కాశాలు రాలేదు. వ‌చ్చినా – బాహుబ‌లిలా ప్ర‌భావం చూపించ‌క‌లేపోయింది. దానికి తోడు భారీ పారితోషికం డిమాండ్ చేస్తూ… నిర్మాత‌ల్ని, సినిమాల్నీ దూరం చేసుకుంటోంది. అందులో ఇప్పుడు కేజీఎఫ్ 2 కూడా చేరిపోయింది.