మీ టూ: నానా ప్లేస్‌లో రానా…!

Rana Daggubati Replaces Nana Patekar After He Is Thrown Out Of Akshay Kumar Housefull 4

బాలీవుడ్‌ నటి తనూశ్రీ మీ టూ ఉద్యమాన్ని ఇండియాలో ఉదృత స్థాయికి తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై తనూశ్రీ లైంగిక ఆరోపణలు చేసింది. తనూశ్రీ ఆరోపణల వల్ల నానాకు ఇదివరకు ఉన్నా పాజిటివ్‌ ఇమేజ్‌ అంతా కూడా తుస్సుమంది. దాంతో నానా ప్రస్తుతం తన ఇమేజ్‌ను నిలబెట్టుకోవడానికి తనపై వస్తున్న ఆరోపణలను న్యాయ పరంగా కొట్టిపారేయాలనుకుంటున్నాడు. అప్పటి వరకు సినిమాలకు దూరంగా ఉండాలని భావించినట్టు తెలుస్తోంది. దీంతో నానా నటిస్తున్న ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రం నుండి తాజాగా తప్పుకున్నాడు. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు కూడా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్‌ 4’ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నట్టు సమాచారం అందుతోంది.

rana

‘హౌస్‌ఫుల్‌’ మొదటి మూడు భాగాలుగా సూపర్‌హిట్‌ అయిన విషయం తెల్సిందే. నాలుగవ పార్టును కూడా అదేస్థాయిలో తెరకెక్కిస్తున్న యూనిట్‌కు మీ టూ గట్టి షాకిచ్చింది. దర్శకుడిగా ఈ చిత్రానికి అసోసియేట్‌ దర్శకుడుగా పనిచేస్తున్న వ్యక్తి భాద్యతలు తీసుకున్నాడు. ఇకపోతే నానా పాత్రకు ఎవరిని తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. తాజాగా నానా స్థానంలో రానాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రానా ఇమేజ్‌, వయస్సుకు తగ్గట్టుగా కథను మారుస్తున్నారు. త్వరలోనే ఈ కొత్త కాంభినేషన్‌లో ‘హౌస్‌ఫుల్‌ 4’ తెరకెక్కబోతుంది. ఇప్పటికే నానాతో తెరకెక్కించిన షూట్స్‌ను రానాతో రీషూట్‌ చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది.

pooja-hegde-Housefull-4-mov