రానాకి ఆపరేషన్ !

Rana Daggubati to Undergo eye surgery

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్ టాల్ హీరో రానా దగ్గుబాటి గురించి జానాలకి తెలియని సీక్రెట్ ఒకటి ఉంది. అదేంతంటంటే అతడి కుడి కన్ను కనిపించదు. రానా సన్నిహితులు, స్నేహితులు సహా ఇండస్ట్రీ వర్గాల్లో కొందరికి మాత్రమే తెలిసిన విషయమిది. అయితే ఇటీవల ఆయన మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ షోలో తన కన్ను ఒకటి లేదని తర్వాత ఎవరో ఇచ్చిన కాంతిని పెట్టుకున్నానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే భళ్లాల దేవగా, నేనేరాజు నేనే మంత్రి వంటి సినిమాల్లో అసమాన ప్రతిభ కనబరిచిన మేటి కథానాయకుడికి ఇలాంటి సమస్య ఉందా? అంటూ అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇదివరకే హైదరాబాద్ మ్యాక్సివిజన్లో డా.సతీష్ గుప్తా రానా కుడికంటికి ఆపరేషన్ చేశారు.

అయితే తాజాగా అదే కంటికి విదేశాల్లో శస్త్ర చికిత్స చేయించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అయితే స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో విదేశాల‌లో కంటికి స‌ర్జ‌రీ చేయించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఇప్ప‌టికే హాస్ప‌ట‌ల్లో చేరిన రానాకు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు… హై బిపి ఉండ‌టంతో కొన్ని రోజుల త‌ర్వాత ఆప‌రేష‌న్ చేయాల‌ని నిర్ణ‌యించారు… ఆప‌రేషన్ చేయించుకున్న అనంత‌రం అక్క‌డే వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుని భారత్ కు రానున్నాడు. ప్రస్తుతం `హాతీ మేరీ సాథీ` త్రిభాషా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో మూడు క్రేజీ ప్రాజెక్టులు అతడి క్యూలో ఉన్నాయి. అయితే సర్జరీకి సంబంధించిన డేట్ ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదని రానా తండ్రి సురేష్ బాబు తెలిపారు.