రష్మిక చేతుల మీదుగా విడుదల

రష్మిక చేతుల మీదుగా విడుదల

రాజ్ తరుణ్ ఒక్క హిట్ ఎంతగా పరితపిస్తున్నాడో అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన రాజ్ తరుణ్‌కు ఇప్పుడు హిట్ అనేది లేకుండా పోయింది. చివరగా ఓరేయ్ బుజ్జి అనే చిత్రంతో పలకరించాడు. కానీ అది కూడా వర్కవుట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు రాజ్ తరుణ్ స్టాండప్ రాహుల్ అంటూ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన వదిలిన టీజర్ అందరినీ నవ్వించింది.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా కనిపించింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి పదా అనే లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రయూనిట్ రష్మిక మందన చేతుల మీదుగా విడుదల చేయించింది. ఇక ఈ లిరికల్ వీడియోలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.స్వీకర్ అగస్తి మంచి మెలోడీ ట్యూన్‌ను అందించగా.. యాజిన్ నాజర్ గాత్రం చక్కగా కుదిరింది.

శ్రీరాజ్ రవీంద్రన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజ్ తరుణ్ లుక్స్ ట్రెండీగా ఉన్నాయి. వర్ష బొల్లమ్మ క్యూట్‌గా కనిపిస్తోంది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల మీద నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించిన ఈ సినిమాతో శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. చూస్తుంటే ఈ సినిమాలో కామెడీతో పాటు అన్ని ఎమోషన్స్ వర్కవుట్ అయ్యేలా ఉన్నాయి.