పొంచి ఉన్న ముప్పు

పొంచి ఉన్న ముప్పు

దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ తీరాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. ఉత్తర శ్రీలంకపై గత ఆరు గంటలలో 11 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి లాట్ సమీపంలోని మన్నార్ గల్ఫ్ వద్ద బురేవీ తుపాను కేంద్రీ కృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మన్నార్‌కు పశ్చిమ-వాయువ్య దిశలో 30 కి.మీ, పంబస్‌కు తూర్పు-ఆగ్నేయంలో 40 కి.మీ, కన్యాకుమారికి తూర్పు-ఈశాన్యంగా 260 కి.మీ. దూరంలో ఉందని తెలిపింది.

దక్షిణ తమిళనాడు తీరం పంబన్, కన్యాకుమారి మధ్య నేడు రాత్రి, రేపు తెల్లవారు జామున సైక్లోనిక్ తుపానుగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ సమయంలో 70-80 కి.మీ వేగంతో బలంగా గాలులు వీచే అవకాశం ఉందని, దక్షిణ తమిళనాడు తీరప్రాంత జిల్లాలతో పాటు రామనాథపురం, కన్యాకుమారి జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.