విటమిన్ డి డెఫిషియెన్సీ ఉండడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు క్యాన్సర్ వంటి మొదలైన జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ప్రస్తుతం ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే విటమిన్-డి కూడా ఉండాలని వింటూ ఉన్నాం. ఎప్పుడైతే విటమిన్-డి శాతం శరీరంలో సరిగా ఉండదో అనేక ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయని మరియు ప్రమాదం ఎక్కువ ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంను 100% నిరూపించలేదు. పైగా ఇంకా దీని గురించి చర్చలు జరుగుతున్నాయి.
మన శరీరంలో 70 శాతం రోగనిరోధక వ్యవస్థ గట్లోనే ఉంటుంది. అంతే కాకుండా ఎప్పుడైతే గట్ ఆరోగ్యంగా ఉంటుందో, అప్పుడే సరైన ఫంక్షన్ జరుగుతుంది. వీటన్నిటితో పాటుగా ఒక పరిశోధనలో చెప్పిన విషయం ఏమిటంటే విటమిన్ డి వల్ల శరీరానికి అవసరమయ్యే ఆరోగ్యపు మైక్రోబియన్స్ అందుతాయి. మరియు గట్ లైనింగ్‌కు సంబంధించిన ఇన్ఫ్లమేషన్ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ముఖ్యంగా విటమిన్ డి, రోగ నిరోధక శక్తి మరియు గట్ ఆరోగ్యానికి చాలా సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఎప్పుడైతే గట్ ఆరోగ్యం బాగుంటుందో అప్పుడు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పైగా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే గట్ ఆరోగ్యం దెబ్బతింటుందో అప్పుడు రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది, టాక్సిన్స్ మరియు ఆటో ఇమ్యూన్ సంబంధించిన సమస్యలు వస్తాయి. ఎప్పుడైతే గట్ ఆరోగ్యం బలహీనంగా ఉంటుందో రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది.
అప్పుడు ఎన్నో రకాల నాన్ కమ్యునికబుల్ మరియు ఆటో ఇమ్యూన్‌కు సంబంధించిన జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ , సిలియాక్, రిమోటోయ్డ్ ఆర్తరైటిస్, మెటబాలిక్ సిండ్రోమ్, న్యూరో డీజనరేటివ్ డిజార్డర్ మరియు క్యాన్సర్ వంటి మొదలైన జబ్బులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
విటమిన్ డి మరియు విటమిన్-డి కు సంబంధించిన న్యూక్లియర్ రిసెప్టార్ వల్ల ఇంటెస్టైన్ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అంతే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెటాబాలిటెస్ రిలీజ్ చేసే మైక్రోబయోమ్స్ వల్ల కూడా విటమిన్ డి న్యూక్లియర్ రిసెప్టార్స్ బాగుపడతాయి. పైగా ఇంటెస్టైనల్ బారియర్ ఇంటిగ్రిటీ మరియు ఇంటెస్టైన్కు సంబంధించిన సహజసిద్ధమైన ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అయితే విటమిన్ డి శాతం సరైన మోతాదులో ఉండాలని విటమిన్-డి సప్లిమెంట్స్‌ను తీసుకుంటున్నారు.
దీని వల్ల చాలా రకాల ఆరోగ్య సంబంధించిన ఉపయోగాలు ఉంటాయి. కానీ సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది అని వివిధ రకాల జబ్బులను తగ్గించుకోవచ్చని ఎక్కడ నిరూపించ లేదు. 2019 లో సుమారు 30 లక్షల మంది విటమిన్-డి సప్లిమెంట్స్ వల్ల గుండె సంబంధించిన జబ్బులు మరియు క్యాన్సర్‌ను నిర్మూలించ లేక పోయామని తెలియజేశారు. ఇంకొన్ని పరిశోధనలలో కూడా ఇదే విషయం తేలింది, అయితే కొంత మంది నిపుణులు ఇటువంటి ఫలితాలు వస్తున్నాయని మరి కొన్ని ప్రయత్నాలు చేశారు.
నిపుణులు కనుగొన్నది ఏంటంటే గట్‌లో ఉన్న బ్యాక్టీరియా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది అని మరియు దాని వల్ల విటమిన్-డి కన్వర్ట్ అవుతుందని తెలిపారు. ఈ విధంగా ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. మనం ఎంత విటమిన్ డిను తీసుకున్నాము అనేది ముఖ్యం కాదు. మన శరీరంలో ఎంత విటమిన్ శాతం ఉంది అనేదే అవసరం. కాబట్టి మీ శరీరంలో ఉండేటువంటి విటమిన్ శాతం వల్ల మీరు గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, అంతే కాకుండా కొన్ని పరీక్షలు నిర్వహించిన నిపుణులు తెలియజేసినది ఏమిటి అంటే శరీరం లో ఉండేటువంటి యాక్టివ్ విటమిన్ డి మరియు గట్‌లో ఉండే బ్యాక్టీరియాకు చాలా సంబంధం ఉంటుంది. ఆ బ్యాక్టీరియా శరీరానికి చాలా మేలు చేస్తుంది అని డాక్టర్లు చెబుతున్నారు. పైగా ఒక మనిషి గట్‌లో ఉండేటువంటి వివిధ రకాలైన బ్యాక్టీరియాలలో యాక్టివ్ విటమిన్ డికు చాలా సంబంధం ఉంది.
గట్ ఆరోగ్యం అనేది డైట్‌పై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా డైట్ మరియు ఇమ్యూనిటీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. గట్‌లో ఉండేటు వంటి బ్యాక్టీరియా సరైన విధంగా ఉండాలన్నా, గట్ ఆరోగ్యం బాగుండడం కోసం, ఇన్ఫ్లమేషన్ మరియు వివిధ రకాల ఫంక్షన్లు సరిగ్గా ఉండాలన్నా డైట్ చాలా అవసరం. పైగా డైట్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పవచ్చు.
సహజంగా ఎక్కువ శాతం ట్రాన్స్ ఫ్యాట్ తీసుకోవడం, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లను తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఉప్పు ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుని బ్యాలెన్స్ డైట్‌ను పాటించకపోవడం వల్ల గట్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. కాబట్టి కచ్చితంగా తాజా కూరగాయలు, పండ్లు, ప్రోటీన్, చేప మరియు యాంటీ ఆక్సిడెంట్స్‌ను తగినన్ని తీసుకోవాలి. కొంతమంది చాలా ఎక్కువ ఆహారాన్ని తీసుకుని చిన్న చిన్న పనులను మాత్రమే చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డైట్ ప్లానింగ్ మరియు బ్యాలెన్స్డ్ డైట్ ఎంతో అవసరం. గట్‌లో సరైన బ్యాక్టీరియా ఉండాలన్నా, గట్ ఆరోగ్యాన్ని పొందాలన్నా ఖచ్చితంగా కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు, ప్రోబయోటిక్స్, ప్రోటీన్ మొదలగు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.
ఎప్పుడైతే డైట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్స్ తీసుకుంటారో జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది. అంతే కాకుండా రోగ నిరోధక వ్యవస్థ సరైన రీతి లో పని చేస్తుంది. ఎప్పుడైతే మంచి పోషకాలు ఉండేటు వంటి ఆహారాన్ని, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ మరియు మినిరల్స్ ని తీసుకుంటామో గట్ ఆరోగ్యమే కాకుండా శరీర ఆరోగ్యం మొత్తం బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లమేషన్కు సంబంధించిన జబ్బుల నుండి కాపాడుకోవడానికి చాలా మంది మెడిటేరియన్ డైట్‌ను ప్రిఫర్ చేస్తున్నారు. ఈ డైట్‌ను పాటించడం వల్ల కాన్సర్, డయాబెటిస్, ఒబేసిటీ, మెటబాలిక్ సిండ్రోమ్, అథెరోస్కిరోసిస్ మరియు కాగ్నిటివ్ ఇంపయిర్మెంట్ వంటి మొదలు సమస్యలు రాకుండా ఉంటాయి.
మన భారత దేశంలో సుమారు 76 శాతం మంది విటమిన్ డి డెఫిషియన్సీతో బాధ పడుతున్నారు. ఈ విధంగా డెఫిషియన్సీ ఉండడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఒక సర్వే ప్రకారం 18 నుండి 30 వయసు గలవారు ఎక్కువగా విటమిన్ డి డెఫిషియెన్సీని ఎదుర్కొంటున్నారు. విటమిన్ డి డెఫిషియెన్సీ నుండి బయట పడాలంటే ప్రతి రోజూ ఖచ్చితంగా సూర్య రశ్మి తగిలేటట్టుగా చూసుకోవాలి. దీంతో పాటుగా మీ డైట్లో కొన్ని మార్పులు చేసుకుంటూ ఉండాలి. విటమిన్ డెఫిషియెన్సీ బాగా ఎక్కువగా ఉంటే డాక్టర్ సూచనల మేరకు సప్లిమెంట్స్‌ను తీసుకోండి.
ఒబేసిటీ, డార్కర్ స్కిన్ ఉన్న వారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మంలో ఉండేటువంటి మెలనిన్ పిగ్మెంట్ విటమిన్ డి ప్రొడక్షన్‌ను తగ్గిస్తుంది. అందుకని డార్కర్ స్కిన్ ఉన్నప్పుడు లేదా ఎక్కువ మెలనిన్ శాతం ఉన్న వారు ఎక్కువ సమయాన్ని సూర్యరశ్మి తగిలేటట్టు ఉండాలి. కాబట్టి గట్ హెల్త్ బాగుండాలంటే విటమిన్ డెఫిషియెన్సీ లేకుండా చూసుకోవాలి. దీంతో పాటుగా బ్యాలెన్స్ డైట్‌ను పాటించాలి. ఈ విధంగా చేస్తే గట్ ఆరోగ్యంగా ఉంటుంది మరియు రోగ నిరోధక వ్యవస్ధ బలపడుతుంది.