రేవంత్ కాంగ్రెస్ బాహుబ‌లి…

Revanth reddy as Congress Bahubali says Ram Gopal Varma

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

త‌ర‌చూ త‌న సినిమాల గురించో, లేదంటే సినిమా వ్య‌క్తుల గురించో సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న స‌మ‌కాలీన రాజ‌కీయాల గురించి మాట్లాడే సంద‌ర్భాల‌ను వేళ్ల‌మీద లెక్క‌పెట్టొచ్చు. రెండు నెల‌ల క్రితం గౌత‌మ్ రెడ్డి, వంగ‌వీటి రాధ వివాదం స‌మ‌యంలో స్పందించిన వ‌ర్మ మ‌ళ్లీ చాలా రోజుల త‌ర్వాత రాజ‌కీయాల‌పై ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారిన రేవంత్ రెడ్డీ రాజీనామా ఘ‌ట‌నపై వ‌ర్మ కామెంట్ చేశారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేర‌డం త‌న‌కు చాలా చాలా సంతోషం క‌లిగించింద‌ని వ‌ర్మ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చేర‌టం వ‌ల్ల కాంగ్రెస్ పై త‌న‌కు మ‌ళ్లీ న‌మ్మ‌కం పెరిగింద‌ని చెప్పిన వ‌ర్మ రేవంత్ ను కాంగ్రెస్ బాహుబ‌లితో పోల్చారు. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేట‌ర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబ‌లి అని… ఆ సినిమా బాక్సాఫీస్ కు నోట్ల వ‌ర్షం కురిపిస్తే..రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు ఓట్ల వ‌ర్షం కురిపిస్తాడ‌ని వ‌ర్మ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. వ‌ర్మ పోస్ట్ కు నెటిజ‌న్లు పెద్ద ఎత్తున లైక్ లు కొట్టారు.

Revanth reddy is Congress Bahubali says Ram Gopal Varma