చెరపకురా చెడేవు…షాపుకు నిప్పు పెట్టబోతే చాచికొట్టిన మంట

Rowdy Sheeter injured after setting fire to Shop for not giving money in Alwal

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

చెరపకురా చెడేవు అని తెలుగులో ఒక సామెత ఉంది..ఆ సామెతను జ్ఞప్తికి తెచ్చింది నిన్న హైదరాబాద్ శివారు అల్వాల్ లో జరిగిన ఒక ఘటన. హైదరాబాద్ శివారు ప్రాంతం అల్వాల్ లో రౌడీ షీటర్ నవీన్ నెలకు రూ.10 వేలు నెల మామూళ్లు ఇవ్వాలంటూ ఓ షాపు యజమానిని బెదిరించాడు. సదరు యజమాని అంత మొత్తం ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఆ గోదాంపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన యువకుడు ఆదే మంటల్లో గాయపడి ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. అల్వాల్‌కు చెందిన శ్యామ్‌ స్థానిక జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయం సమీపంలో ఎంబి సౌండ్స్‌ పేరుతో శుభకార్యాలకు డెకరేషన్, లైట్లు, జనరేటర్లను అద్దెకు ఇచ్చే వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

మంగళవారం మధ్యాహ్నం గోదాంలో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అదే ప్రాంతానికి చెందిన నవీన్‌యాదవ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన నవీన్‌ను చికిత్స నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే షాపు యజమాని ఫిర్యాదు మేరకు అక్కడి సిసి కేమేరాలకి చిక్కిన విజుయల్స్ చూసి మైండ్ బ్లాక్ అయ్యింది. వసూల్లకి వచ్చి అవి ఇవ్వకపోవడంతో షాపుకి నిప్పు పెట్టగా అది తిరిగొచ్చి అతన్నే గాయపరిచింది.