హిట్టు కొట్టారు…గిఫ్టులు పడుతున్నారు !

RX100 Director Receives Costly Gift From Producer

తన జీవితంలో, తన స్నేహితుడి జీవితంలో జరిగిన వాస్తవ పరిస్థితుల్ని కథగా మలిచి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడికి RX 100 నిర్మాత అశోక్ విలువైన బహుమతిని అందచేశారట. తన బ్యానర్ లో వచ్చిన రెండో చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్ చేసిన అజయ్ కి నిర్మాత అశోక్ రెడ్డి రూ. 16 లక్షల విడువైన జీప్ కంపేనీ కారును బహుమతిగా అందచేశారు.

RX100 Director Receives Costly Gift From Producer

వర్మ శిఘ్యుడిగా కొత్తరకం స్క్రీన్ ప్లేతో గ్రామాల్లో ప్రేమికుల మధ్య ఉండే నాటు సరసం, దర్శకుడు ఒడిసిపట్టుకోవడంతో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. నిర్మాతలకు లాభాల పంటను పండించింది. లాంగ్ రన్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ..రూ.11 కోట్ల రూపాయల షేర్‌ను వసూలు చేసి చిన్న చిత్రాల్లో అగ్రపీఠంలో నిలిచింది. కేవలం రూ.3 కోట్లతో నిర్మించిన ఈ మూవీ నాలుగు రెట్లు లాభాన్ని తెచ్చిపెట్టింది. అందుకే ఇటీవల చిత్ర యూనిట్ అంతటికీ ఐఫోన్ లు పంచి పెట్టారు నిర్మాత

RX100 Director Receives Costly Gift From Producer