సలార్ లేటెస్ట్ కలెక్షన్లు ఎంతంటే ..!

Salaar : సలార్ లేటెస్ట్ కలెక్షన్లు ఎంతంటే ..!
Cinema News

పాన్ ఇండియా హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్ పార్ట్ 1’తో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నారు. డిసెంబర్ 22న రిలీజైన ఈ సినిమా దేశవ్యాప్తంగా థియేటర్లలో హౌస్ ఫుల్ షోలతో దూసుకుపోతోంది. ఇక బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ఊచకోత కోస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా ఈ రేంజ్లో కలెక్షన్లు కురిపించడం ఇదే మొదటిసారి. మరోవైపు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు విపరీతంగా ఫిదా అవుతున్నారు.

 

Salaar : సలార్ లేటెస్ట్ కలెక్షన్లు ఎంతంటే ..!
Salaar

రాధేశ్యామ్, అదిపురుష్ వంటి డిజాస్టర్ల తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఆకట్టుకుంటోంది.క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమాకి హౌస్ఫుల్ బోర్డులు ఎక్కువగా కనబడుతున్నాయి. తాజాగా సలార్ సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డుని బ్రేక్ చేసింది. నాలుగవ రోజు అత్యధిక షేరు వసూలు చేసిన సినిమాల జాబితాలో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉంది. గతంలో 17.73 కోట్లతో మొదటి స్థానంలో ఉన్న ఆర్ఆర్ ఆర్ సినిమాని దాటి 18.05 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. కాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ మేరకు అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా బృందం.