ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ ట్రైలర్ వచ్చేస్తోంది..!

ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ ట్రైలర్ వచ్చేస్తోంది..!
Cinema News

Salaar Trailer : “సలార్” ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసారు . ఇవాళ సలార్ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్ర లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ మరియు భారీ విఎఫ్ఎక్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ ట్రైలర్ వచ్చేస్తోంది..!
Prabhas ” Salaar ” Trailer

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని.. పోస్టు ప్రొడక్షన్ పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. అయితే..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా నుంచి చిత్ర యూనిట్ ఒక అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 1న అంటే ఇవాళ రాత్రి 7:19 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ఒక జీప్ పై ప్రభాస్ గన్ పట్టుకొని ఫైర్ చేస్తున్న ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పార్ట్-1 డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.