సలార్: అడ్వాన్స్ బుకింగ్స్‌కు సిద్ధంగా ఉండండి!

సలార్: అడ్వాన్స్ బుకింగ్స్‌కు సిద్ధంగా ఉండండి!
Cinema News

మోస్ట్ అవైటెడ్ సినిమా ‘సలార్’. కేజీఎఫ్ 1,2 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక నిన్న రిలీజ్ అయిన ట్రైలర్‏తో సినిమా ఏ రేంజ్‏లో ఉండబోతుందో అర్థమవుతుంది. యాక్షన్, ఎమోషన్ సీన్లతో గూస్‏బంప్స్ తెప్పించేలా ఉంది. ఖాన్సార్ సామ్రాజ్యం కోసం జరిగే పోరాటాల నేపథ్యంలో ఈ సినిమా ఉన్నట్టు అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత యాక్షన్ మోడ్‏లో అదరగొట్టేశారు ప్రభాస్. రవి బస్రూర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి ఇంటెన్స్‌గా సాగింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. ఇప్పుడు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

సలార్: అడ్వాన్స్ బుకింగ్స్‌కు సిద్ధంగా ఉండండి!
Salaar Cinema

త్వరలోనే దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో సలార్ ప్రెస్ మీట్స్ నిర్వహించనుంది చిత్రయూనిట్. ఈక్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది . లేటేస్ట్ అప్డేట్ ప్రకారం మనదేశంలో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ కానున్నాయని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.