బీస్ట్ మోడ్‌లో దూసుకుపోతున్న “సలార్” ప్రీసేల్స్..!

బీస్ట్ మోడ్‌లో దూసుకుపోతున్న
Cinema News

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా ల్లో భారీ హైప్ నడుమ రిలీజ్ కి రాబోతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ సలార్ ఫీవర్ ఇప్పుడు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగు స్టేట్స్ లోనే కాకుండా ఈ సినిమాకి యూఎస్ మార్కెట్ లో నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ ని సలార్ చూపిస్తుంది. మరి ఎప్పుడు నుంచో భారీ బుకింగ్స్ ని ప్రీ సేల్స్ లో రాబడుతున్న ఈ సినిమా ఇప్పుడు మరో రికార్డు మైల్ స్టోన్ జస్ట్ ప్రీ సేల్స్ లోనే కొట్టేసింది.

బీస్ట్ మోడ్‌లో దూసుకుపోతున్న "సలార్" ప్రీసేల్స్..!
Salaar Movie

మరి ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 1.5 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని రాబట్టి అదరగొట్టింది. దీనితో అక్కడ బుకింగ్స్ మాత్రం ఇప్పుడు బీస్ట్ మోడ్ లో ఉన్నాయని చెప్పాలి. ఇక రిలీజ్ డేట్ కి 2 మిలియన్ ని క్రాస్ చేసిన ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. ఇక ఈ అవైటెడ్ సినిమా కి రవి బసృర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.