సలార్ : సంధ్య 70MM స్క్రీన్ పై సునామి..!

సలార్ : సంధ్య 70MM స్క్రీన్ పై సునామి..!
Cinema News

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఈ సినిమా ని హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగాందూర్ నిర్మించగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి నుండి అందరిలో సలార్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం అందరికి తెలిసిందే.

 సలార్ : సంధ్య 70MM స్క్రీన్ పై  సునామి..!
Salaar Movie

విషయం ఏమిటంటే, మరికొద్ది గంటల్లో సలార్ వరల్డ్ వైడ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. మరోవైపు అనేక ప్రాంతాల్లో సలార్ టికెట్ బుకింగ్స్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతున్నాయి. ఇక కొద్దిసేపటి క్రితం సలార్ మెయిన్ థియేటర్ అయిన హైదరాబాద్ లోని సంధ్య 70 ఎమ్ ఎమ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ సందర్భంగా పలువురు ఫ్యాన్స్ బాణాసంచా కాల్చడంతో పాటు జోరుగా లైటింగ్స్ ఏర్పాటు చేసి బ్యాండ్ బాజాలు మ్రోగించి జరుపున్న సంబరాలు అంబరాన్నంటాయి.

https://twitter.com/hashtag/Prabhas?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1737879966937964748%7Ctwgr%5Ecc85b27864067243bfdb7b6e833881798f991159%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-37222590671895938717.ampproject.net%2F2312012346000%2Fframe.html&src=hashtag_click