వాట్సాప్ ఛానెల్ లోనే సలార్ అప్డేట్..!

వాట్సాప్ ఛానెల్ లోనే సలార్ అప్డేట్..!
Movie News, Latest News

ఇండియా సినీ ఇండస్ట్రీలోనే పాన్ ఇండియా స్టార్స్ గా కొనసాగుతున్న హీరో ప్రభాస్..కేజీఎఫ్ సినిమా తో సెన్సేషన్ విజయాన్ని సాధించి పాన్ ఇండియా అగ్ర దర్శకుడిగా క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా సలార్. ఈ సినిమా కి సంబంధించిన ప్రకటన విడుదలైనప్పటి నుంచి అభిమానుల్లో భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవలే సలార్ సినిమా కి సంబంధించి మినీ టీజర్ విడుదలైంది. ఈ మూవీ లో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ డైనోసార్ తో పోల్చడంతో అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి.

వాట్సాప్ ఛానెల్ లోనే సలార్ అప్డేట్..!
Prabhas

ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ యొక్క నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ తాజాగా ఒక వాట్సాప్ ఛానల్ ఏర్పాటు చేసింది. ఈ ఛానల్ లో ఎక్స్ క్లూజివ్ కంటెంట్ తో పాటు మూవీ ల అప్డేట్.. మరికొన్ని సర్ ప్రైజ్ లు రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. దీంతో పాటు.. సలార్ రిలీజ్ డేట్, మిగతా అప్డేట్స్ కూడా వాట్సాప్ ఛానల్ లోనే రిలీజ్ చేస్తామని తెలిపారు . కొత్త విడుదల తేదీని ఈనెల 28న ప్రకటించే అవకాశముంది. వాస్తవానికి సెప్టెంబర్ 28న సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. అయితే సలార్ మూవీ ఎప్పుడూ విడుదల చేసేది సెప్టెంబర్ 28న క్లారిటీ రానుంది.