అదరగొట్టే స్కెచ్ వేసిన సల్మాన్ ఖాన్

అదరగొట్టే స్కెచ్ వేసిన సల్మాన్ ఖాన్

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో  బాలీవుడ్‌ సెలబ్రిటీలంతా ఇంట్లోనే వర్కవుట్స్‌, వ్యాయమం​ చేస్తున్న వీడియోలతో పాటు కుటుంబంతో సరదాగా గడుపుతున్న వీడియోలను సోషల్‌ మీడియాలో తరచూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందుకు బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ మినహాయింపు కాదు. ఈ ఖాళీ సమయంలో తనలోని టాలెంట్‌కు పని చెప్పాడు భాయిజాన్‌. పేపర్‌పై మహిళ, పురుషుడి స్కెచ్‌ వేస్తున్న వీడియోను గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

సల్మాన్ నల్లని దుస్తుల్లో ఉన్న మహిళా, పురుషుడి చిత్రాని స్కెచ్‌ వేస్తూ.. ‘ప్రస్తుతం మనం ధరించే విధానం.. భారత సంస్కృతికి గొప్పతనం’ అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక భాయిజాన్‌ స్కేచ్‌కు ‘సూపర్‌ టాలెంట్‌’ ‘చాలా అద్భుతంగా’ ఉందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.