కొత్త శాంసంగ్ స్మార్ట్ ఫోన్ సేల్

కొత్త శాంసంగ్ స్మార్ట్ ఫోన్ సేల్

శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌ను అందించారు. వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.20,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర తెలియరాలేదు. స్లేట్ బ్లాక్, స్కై బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపు లభించనుంది.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ టీఎఫ్‌టీ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

8 జీబీ వరకు ర్యామ్‌ను ఇందులో అందించారు. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌ను అందించారు. వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.20,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర తెలియరాలేదు. స్లేట్ బ్లాక్, స్కై బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపు లభించనుంది.ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ టీఎఫ్‌టీ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.8 జీబీ వరకు ర్యామ్‌ను ఇందులో అందించారు. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.