న్యూడ్‌ సీన్స్‌లో న్యూడ్‌గా నటించలేదు

Sanjana Clarifies On Dhandupalyam2 Movie Nude Scenes

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘బుజ్జిగాడు’ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన సంజన ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది. పెద్దగా టాలీవుడ్‌లో గుర్తింపు రాకపోవడంతో ప్రస్తుతం కన్నడంలో వరుసగా సినిమాలు చేస్తూంది. తాజాగా ఈ అమ్మడు ‘దండుపాళ్యం 2’ చిత్రంలో నటించింది. ఆ సినిమాలో ఈమె పూర్తి న్యూడ్‌గా నటించిందనే ప్రచారం జరిగింది. సెన్సార్‌ బోర్డు ముందుకు వెళ్లిన సినిమా నుండి ఒక సీన్‌ మొత్తం సెన్సార్‌ బోర్డు వారు పూర్తిగా తొలగించారు. ఆ సీన్‌లో సంజన పూర్తి న్యూడ్‌గా ఉంది. సెన్సార్‌ కట్‌కు గురైన ఆ సీన్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు లీక్‌ చేశారు. దాంతో అది కాస్త యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేసింది.

పూర్తి న్యూడ్‌గా నటించడంతో సంజనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. న్యూడ్‌గా నటించడంపై కొందరు ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరి కొందరు ఆమెపై దాడికే ప్రయత్నించారు. దాంతో సంజన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ న్యూడ్‌ సీన్స్‌లలో కనిపిస్తున్నది అంతా నిజం కాదని, అది గ్రాఫిక్స్‌ అంటూ తేల్చి చెప్పింది. న్యూడ్‌ సీన్స్‌ చిత్రీకరణ సమయంలో తాను పూర్తి న్యూడ్‌గా లేను అని, ఇలా గ్రీన్‌ మ్యాట్‌ ధరించి ఉన్నాను అని, ఆ తర్వాత గ్రీన్‌ మ్యాట్‌ను తొలగించి పూర్తి న్యూడ్‌గా కనిపించాను అంటూ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన ఒక ఫొటోను సైతం సంజన రిలీజ్‌ చేయడం జరిగింది. దీంతో సంజనపై వస్తున్న విమర్శలకు బ్రేక్‌ పడ్డట్లయ్యింది.

మరిన్ని వార్తలు:

ఇది మరీ ఓవర్‌ బోయపాటి