సునీల్‌ను దృష్టిలో పెట్టుకో..!

sapthagiri will become another sunil in tollywood

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కమెడియన్‌గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన సునీల్‌ ‘అందాల రాముడు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత సునీల్‌కు వరుగా హీరోగా సినిమా ఛాన్స్‌లు వచ్చాయి. హీరోగో అవకాశాలు వస్తున్నా కదా అని హీరోలా ఉండాలనే ఉద్దేశ్యంతో తన ఫిజిక్‌ను పూర్తిగా మార్చేశాడు. ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోగా మారిపోయాడు. అయితే ఇప్పుడు సునీల్‌కు హీరోగా పెద్దగా సక్సెస్‌లు దక్కడం లేదు. దాంతో మళ్లీ కమెడియన్‌గా అవకాశాల కోసం ప్రయత్నించినా కూడా సునీల్‌కు అవకాశాలు రావడం లేదు. కారణం సునీల్‌ లుక్‌. ఇక ఇప్పుడు సునీల్‌ పరిస్థితి కమెడియన్‌ సప్తగిరికి భవిష్యత్తులో ఎదురయ్యే అవకాశం ఉందని ముందే సినీ వర్గాల వారు హెచ్చరిస్తున్నారు.

సహాయ దర్శకుడిగా చేసిన సప్తగిరి కమెడియన్‌గా మారి ఆ మద్య వరుసగా చిత్రాల్లో కమెడియన్‌గా కనిపించాడు. ఆ తర్వాత ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంతో హీరోగా మారాడు. ఆ సినిమా పాజిటివ్‌టాక్‌ను దక్కించుకోవడంతో సప్తగిరి హీరోగానే ఫిక్స్‌ అయ్యాడు. తాజాగా సప్తగిరి హీరోగా తన రెండవ సినిమా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా సప్తగిరికి సక్సెస్‌ను తెచ్చి పెట్టే అవకాశం కనిపిస్తుంది.

ప్రస్తుతం సప్తగిరి వెంట అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతానికి ఓకే కాని భవిష్యత్తులో సునీల్‌లా ఎటూ కాకుండా అవుతాడేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. హీరోగా చేస్తూనే కమెడియన్‌గా కూడా సినిమాలు చేయాలని సప్తగిరికి సన్నిహితులు సలహా ఇస్తున్నారు. మరి సునీల్‌ ఆ సలహా పట్టించుకుంటాడా అనేది చూడాలి.