ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘స‌లార్’ నుంచి సెకండ్ ట్రైల‌ర్..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘స‌లార్’ నుంచి సెకండ్ ట్రైల‌ర్..!
Salaar trailer

పాన్ ఇండియా సినిమా లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్‌ కూడా ఒకటి. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ , ప్రభాస్‌ కాంబినేషన్‌లో వ‌స్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన స‌లార్ ట్రైల‌ర్ యూట్యూబ్‍లో రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా ట్రైల‌ర్ అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్లకు పైగా వ్యూస్ దాటాయి.

 

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘స‌లార్’ నుంచి సెకండ్ ట్రైల‌ర్..!
Salaar trailer

ఈ ట్రైలర్‌కి ప్రశంసలతోపాటు విమర్శలు కూడా ఎదురవ్వడం చర్చనీయాశంగా మారింది. ఈ ట్రైలర్‌ని చూసిన కొందరు క్రిటిక్స్‌.. సినేరియా మొత్తం ‘కేజీఎఫ్‌’ తరహాలోనే ఉందని, కథ కూడా దాదాపు అలాగే ఉందని, దీన్ని ‘కేజీఎఫ్‌ 3’ అనుకోవచ్చని విమర్శలు వస్తున్నాయి . అయితే ఈ సినిమా ట్రైల‌ర్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ స‌లార్ నుంచి రెండో ట్రైల‌ర్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఈ ట్రైల‌ర్‌ను సినిమా విడుద‌ల‌కు 5 రోజుల ముందు చిత్ర‌బృందం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సమాచారం.