హిందీ ‘జెర్సీ’ లో నటించనున్న షాహిద్ కపూర్

హిందీ 'జెర్సీ' లో నటించనున్న షాహిద్ కపూర్

ర‌ష్మిక మంద‌న్నా ను తెలుగు సూప‌ర్ హిట్ మూవీ జెర్సీ హిందీ రీమేక్ కోసం క‌థానాయిక‌గా అనుకుంటున్న‌ట్లు ఇంత‌కుముందు వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ మ‌ధ్య‌లో ఏం జ‌రిగిందో ఏమో కానీ ఆమెను కాద‌ని మృనాల్ ఠాకూర్‌ను ఈ సినిమాకు క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. దీంతో ర‌ష్మిక‌ను అస‌లు నిజంగానే సంప్ర‌దించారా లేదా అన్న సందేహాలు క‌లిగాయి.

ఐతే త‌న‌ను జెర్సీ హిందీ రీమేక్ కోసం అడిగిన మాట వాస్త‌వ‌మే అని ర‌ష్మిక తాజాగా మీడియాకు వెల్ల‌డించింది. ఐతే తెలుగులో శ్ర‌ద్ధ శ్రీనాథ్ త‌న పాత్ర‌ను అద్భుతంగా పోషించింద‌ని ఆ పాత్ర‌కు తాను న్యాయం చేయ‌లేనేమో అనిపించి ఆ సినిమా ఒప్పుకోలేద‌ని ర‌ష్మిక తెలిపింది. ఈ సంగ‌త‌లా ఉంచితే నాని పాత్ర‌లో షాహిద్ న‌టించ‌నున్న ఈ చిత్రాన్ని హిందీలోనూ రాహుల్ తిన్న‌నూరినే డైరెక్ట్ చేస్తున్నాడు. హిందీలో ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండ‌టం విశేషం.