మీకు రోగాలు రావంట్రా ?..శకలక శంకర్ ఫైర్

జబర్దస్త్ షోతో లైమ్‌లైట్‌లోకి వచ్చి కామెడీ క్యారెక్టర్లు చేసుకుంటూ హీరోగా ఎదిగన షకలక శంకర్ ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా షకలక శంకర్ గురించి సోషల్ మీడియాలో ఓ రూమర్ విపరీతంగా వైరల్ అవుతుంది. అదేమిటంటే షకలక శంకర్ చనిపోయాడంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో క్లారిటీ ఇస్తూ జబర్ధస్త్ యాక్టర్ గెటప్ శీను షకలక శంకర్‌తో వీడియోను విడుదల చేశారు. తనకు ఎదో అయిపోయింది అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమంటూ ఆ రూమర్లను ప్రచారం చేసిన వాళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎవడు బే వాడు మీకు రావేంట్రా రోగాలు.. ఎక్కడి నుంచి వస్తార్రా మీరంతా.. మా పని మమ్మల్ని ప్రశాంతంగా చేసుకోనివ్వండ్రా’ అంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు. ఇదే సమయంలో ఇటువంటి వార్తలను ప్రచారం చేయొద్దు అంటూ గెటప్ శ్రీను విజ్ఞప్తి చేశారు.