ఇండియన్‌ 2 లో మరో ఇద్దరు…!

Shankar Indian 2 Kick Starts With Pooja KAMAL HASSAN

శంకర్‌, కమల్‌ హాసన్‌ ల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ‘ఇండియన్‌ 2’ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకుని ప్రారంభం అయిన విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ చిత్రం కూడా సంచలన విజయాన్ని నమోదు చేయడం ఖాయం అంటూ అప్పుడే అంచనాలు పెరిగి పోతున్నాయి. మొదటి పార్ట్‌లో కమల్‌ హాసన్‌ డబుల్‌ రోల్‌ లో నటించాడు. ఇక సీక్వెల్‌లో ఏంటో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కాని ఈ చిత్రంలో ఇద్దరు యువ హీరోలు కూడా నటించబోతున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఆ ఇద్దరు యువ హీరోలు ప్రస్తుతం తమిళ మరియు మలయాళ సినీ పరిశ్రమల్లో స్టార్స్‌గా కొనసాగుతున్నారు.

Shankar-Indian-2-Kick-Start

‘ఇండియన్‌ 2’ చిత్రం కోసం ఇప్పటికే దుల్కర్‌ సల్మాన్‌ను సంప్రదించి ఆయన్ను ఎంపిక చేసిన దర్శకుడు శంకర్‌ తాజాగా శింబును ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు నటిస్తున్న కారణంగా మరింతగా అంచనాలు పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఇండియన్‌ 2లో హీరోయిన్‌గా కాజల్‌ నటించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మొన్నటి వరకు నయన్‌ పేరు వినిపించినా కూడా ఆమె బిజీ షెడ్యూల్‌ మరియు హెవీ పారితోషికం కారణంగా కాజల్‌ ను ఫైనల్‌ చేసినట్లుగా తెలుస్తోంది. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంను రెగ్యులర్‌ షూటింగ్‌కు అతి త్వరలోనే తీసుకు వెళ్లబోతున్నారు.

indian-2