ఇప్పటికీ స్లోగానే తీస్తున్న శేఖర్ కమ్ముల

ఇప్పటికీ స్లోగానే తీస్తున్న శేఖర్ కమ్ముల

లవ్ స్టోరీ చిత్రం మొదలు పెట్టినపుడు నాలుగు నెలల్లో పూర్తి చేసేస్తానని చైతన్య, సాయి పల్లవికి శేఖర్ కమ్ముల చెప్పాడట. దాంతో ఇద్దరు వేరే సినిమాలు పక్కన పెట్టి ముందు శేఖర్ కి డేట్స్ ఇచ్చేసారు. కానీ నాలుగు నెలలు కాదు కదా ఎనిమిది నెలలు గడిచినా ఇంకా ఈ లవ్ స్టోరీ ఒక కొలిక్కి రాలేదు. బాగా చెక్కుతూ ఉంటాడని రాజమౌళిని జక్కన్న అంటూ ఉంటారు. అయితే రాజమౌళి తీసే సినిమాలు అంత చెక్కుడు అవసరం అయినవి.

శేఖర్ కమ్ముల తీసే మాములు ప్రేమ కథలకి కూడా అదే చెక్కుడు ఏమిటనేది చిత్ర సీమలో ఎవరికీ అర్ధం కాదు. అనుభవంతో వేగం పెరగాల్సింది పోయి శేఖర్ ఇప్పటికీ స్లోగానే తీస్తున్నాడు. లవ్ స్టోరీ సమ్మర్లో రాదని తేలిపోయింది. జులైలో రిలీజ్ అయితే గొప్పే అని అంటున్నారు. అయితే శేఖర్ క్రెడిబిలిటీ, అతని ట్రాక్ రికార్డు చూసి అటు హీరో హీరోయిన్లు, ఇటు నిర్మాతలు కూడా ఏమి అనలేకపోతున్నారు.