వామ్మో.. నావల్ల కాదని తప్పుకున్న సిద్దు

siddharth gruham movie release postponed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగులో ‘బొమ్మరిల్లు’ తర్వాత హీరో సిద్దార్థ్‌కు మంచి క్రేజ్‌ దక్కింది. ఆ సినిమా తర్వాత తెలుగులో పలు డైరెక్ట్‌ చిత్రాలను సిద్దార్థ్‌ చేశాడు. కొన్ని సక్సెస్‌ అయ్యాయి. కాని కొన్ని అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. వరుసగా ఫ్లాప్‌లు రావడంతో సిద్దార్ధ సినిమాలకు దూరం అయ్యాడు. ముఖ్యంగా తెలుగులో ఇటీవల సిద్దార్థ్‌ నటించిన ఏ ఒక్క సినిమా విడుదల కాలేదు. చాలా కాలం తర్వాత హీరో సిద్దార్థ్‌ గృహం చిత్రం తెలుగు ప్రేక్షకలు ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. మొదట ఈ చిత్రాన్ని తెలుగులో ఈనెల 10న విడుదల చేయాలని నిర్ణయించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను వాయిదా వేయడం జరిగింది.

 

ఈవారం ఏకంగా అయిదు సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో వాటితో పోటీ తట్టుకోలేక సిద్దార్థ్‌ వెనకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసి చివరి నిమిషంలో ఇలా తప్పుకోవడంతో సిద్దార్థ్‌ గృహం చిత్రం కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు నిరాశ చెందుతున్నారు. గృహం చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూశారు. హర్రర్‌ క్రైమ్‌ థ్ల్రిర్‌ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా సిద్దార్థ్‌ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ఇతర సినిమాలకు కాస్త పోటీ తగ్గినట్లయ్యింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఈ చిత్రంలో సిద్దార్థ్‌కు జోడీగా ముద్దుగుమ్మ ఆండ్రియా హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమాకు మంచి ఆధరణ లభిస్తుంది. అందుకే సేఫ్‌ జోన్‌లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో సిద్దు ఈ నిర్ణయం తీసుకున్నాడు.