భారీ వ్యూస్ తో “స్కంద” మూవీ రిలీజ్ ట్రైలర్!

భారీ వ్యూస్ తో “స్కంద” మూవీ రిలీజ్ ట్రైలర్!
Movie News

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్కంద. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ నిన్న రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.

భారీ వ్యూస్ తో “స్కంద” మూవీ రిలీజ్ ట్రైలర్!
Ram Pothineni

ఈ ట్రైలర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో బాగా దూసుకు పోతుంది. శ్రీ లీల లేడి లీడ్ లో నటించిన ఈ చిత్రంను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.