శ్రీ విష్ణు 17వ చిత్రాని అదిరిపోయే మేకోవర్ …. అదుర్స్!

Sri Vishnu's 17th Movie Gets a Big Makeover .... Adurs!
Sri Vishnu's 17th Movie Gets a Big Makeover .... Adurs!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు వరుస సక్సెస్ లతో దూసుకు పోతున్నారు. చివరిసారిగా ఇటీవల రిలీజ్ అయిన ఓం భీమ్ బుష్ మూవీ లో కనిపించారు. ఈ  మూవీ  బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. తన రోల్ లో ఆడియెన్స్ ని  విశేషం గా ఆకట్టుకున్నారు శ్రీ విష్ణు. ఈ హీరో నెక్స్ట్ సినిమా  పై క్లారిటీ వచ్చింది. SV17 పేరుతో వివరాలను వెల్లడించారు శ్రీ విష్ణు. ఈ కామెడీ థ్రిల్లర్ కు  హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

రెబా మోనికా జాన్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ కి కాల భైరవ సంగీతం అందిస్తుండగా, లైట్ బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లపై మూవీ ని  నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ  ఎలా ఉండబోతుంది అనే దానికోసం ఒక వీడియో ని  రిలీజ్ చేశారు. వీడియో లో శ్రీ విష్ణు మేకోవర్ చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ గా అలరిస్తుంది. వీడియో లో చూపించినట్లు గా ఏదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా మూవీ  ఉండనున్నట్లు ఉంది. ఈ మూవీ  కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.