ఎన్నికల ముంగిట టీడీపీకి షాక్ !

tdp

ఎన్నికల ముంగిట ఏపీ టీడీపీకి చెందిన ఎంపీ సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్ నకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్ ఇచ్చింది. షెల్ కంపెనీల పేరిట బ్యాంకులను మోసగించిన కేసులో రూ.315 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసినట్టు సమాచారం. భారీ ఎత్తున షెల్ కంపెనీలను సుజనా చౌదరి సృష్టించినట్టు ఈడీ గుర్తించినట్టు చెబుతున్నారు. నకిలీ ఆస్తులు, బోగస్ ఇన్వాయిస్ లతో బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకుని, ఆ మొత్తాన్ని షెల్ కంపెనీలకు తరలించినట్టు తెలుస్తోంది. మహాల్ హోటల్ అనే షెల్ కంపెనీని సృష్టించి దాని ద్వారా వైశ్రాయ్ హోటల్ లిమిటెడ్ కు నిధులు తరలించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, పంజాగుట్టలోని నాగార్జున హిల్స్ లోని సుజనా ఆఫీస్ నుంచి డాక్యుమెంట్లు, షెల్ కంపెనీలకు చెందిన 124 నకిలీ రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు. దీని మీద మరింత సమాచారం అందాల్సి ఉంది.