మోసపోయిన సురేష్‌ బాబు

మోసపోయిన సురేష్‌ బాబు

టాలీవుడ్‌ బడా నిర్మాత సురేష్‌ బాబును ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు. తన వద్ద వ్యాక్సిన్లు ఉన్నాయంటూ లక్ష రూపాయలు దోచుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్‌బాబు ఆఫీస్‌కు ఫోన్‌ చేశాడు.

దీంతో అది నిజమని నమ్మిన మేనేజర్‌ అతడు అడిగిన లక్ష రూపాయల సొమ్మును ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. కానీ ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్‌ చేసినా అతడు ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో ఇదంతా పెద్ద మోసం అని గ్రహించిన మేనేజర్‌ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.