కన్నడ యువ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్య

కన్నడ యువ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్య

గత నెలలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. తాజాగా కన్నడ యువ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా చిన్న స్థాయి సినీ, ఫిలిం సెలబ్రెటీలు గత కొన్ని నెలల్లో కొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఐతే సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాబోయే కొనని నెలల్లో ఇలాంటి విషాదాంతాలు మరిన్ని చూడాల్సి వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కరోనా ప్రభావంతో దారుణంగా దెబ్బ తిన్న పరిశ్రమల్లో సినీ రంగం ముందుంటుంది. కరోనా వల్ల సినీ పరిశ్రమలో ఆర్థిక సంక్షోభానాకి తోడు తోడు.. సామాజిక సంబంధాలు బాగా దెబ్బ తినడం సినీ జనాల్ని డిప్రెషన్‌ వైపు నెడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుశాంత్‌ ఆత్మహత్యకు కారణాలేవైనా కానీ.. లాక్ డౌన్ లేకపోయి ఉంటే, మామూలు పరిస్థితుల్లో అయితే అతను అంతటి తీవ్ర నిర్ణయం తీసుకునేవాడు కాదన్నది సన్నిహితుల మాట.

లాక్ డౌన్‌లో ఎక్కువగా ఒంటరిగా ఉండటం వల్ల అతను డిప్రెషన్లోకి వెళ్లి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఆర్థిక స్థిరత్వం ఉన్న వాళ్లు చాలా తక్కువ శాతం. పని ఉంటే డబ్బులుంటాయి. లేదంటే లేదు. నిర్దిష్టమైన ఆదాయం ఎవరికీ ఉండదు. చాలామంది చాలీ చాలని ఆదాయంతోనే నెట్టుకొస్తుంటారు. ఇక సినీ రంగం అంటే మెయింటైనెన్స్ ఖర్చు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో నాలుగు నెలలుగా పని లేక, ఆదాయం లేక అల్లాడిపోతున్న జనాలెందరో. వీళ్లలో చాలామంది ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తున్నారు.