తమిళ స్టార్, చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ మూవీ న్యూ రిలీజ్ డేట్.. ఎప్పుడంటే?

కోబ్రా
కోబ్రా

ప్రయోగాత్మక సినిమాలకు పెట్టింది పేరు విక్రమ్. తమిళ స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలో నటించి సౌత్ ఇండిస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమా సినిమాను కొత్తదనాన్ని చూపిస్తూ ప్రేక్షకులను అలరించడంలో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) ఎప్పుడూ ముందుంటారు. తాజాగా సరికొత్త కథాంశం ద్వారా ‘కోబ్రా’ (Cobra Movie)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మూడేండ్ల కిందనే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పటికీ.. కరోనా.. తదితర కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. ఏట్టకేళకు మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధంగా చేశారు మేకర్స్.

తాజాగా ‘కోబ్రా’ చిత్రం రిలీజ్ డేట్ పై అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఆగస్టు 31న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో మూవీని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ చిత్రాన్ని ఈ నెల 11నే థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఏదేమైనా ఈ నెలలోనే చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావించిన మేకర్స్ 31న ముహూర్తం ఫిక్స్ చేశారు. దీంతో చియాన్ విక్రమ్ నటించిన ఈ ప్రయోగాత్మక చిత్రం కోసం అభిమానులు, ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన పాటలు, పోస్టర్స్, టీజర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. విక్రమ్ సరసన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా న‌టించింది. ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహ‌మాన్ సంగీతం అందించారు. సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని ఎస్‌.ఎస్‌. ల‌లిత్ కుమార్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మకంగా నిర్మించారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుద‌ల‌కానుంది. ఈ చిత్రంతోనే ప్ర‌ముఖ దిగ్గ‌జ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ప్ర‌తినాయ‌కుడి పాత్రలో న‌టిస్తున్నాడు.