ఓటీటీలోకి 12th ఫెయిల్ సినిమా తెలుగు వెర్షన్ వచ్చేసింది …!

Telugu version of 12th Fail movie has arrived in OTT...!
Telugu version of 12th Fail movie has arrived in OTT...!

గతేడాది విడుదలైన మూవీ ల్లో 12th ఫెయిల్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరింత క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన మీమ్స్, రీల్సే. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని భాషలకతీతంగా ప్రేక్షకులు ఆదరించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది.

Telugu version of 12th Fail movie has arrived in OTT...!
Telugu version of 12th Fail movie has arrived in OTT…!

విధు వినోద్‌ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్‌ మాస్సీ ప్రధానపాత్రలో నటించిన మూవీ ‘12th ఫెయిల్‌’ తాజాగా తెలుగు వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఇది స్ట్రీమింగ్‌ అవుతుంది . నిన్నటి వరకు కేవలం హిందీలోనే అందుబాటులో ఉన్న సినిమా .. ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లోనూ ప్రసారం అవుతుంది . దీంతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్న మూవీ గా విడుదలైన ఈ మూవీ సూపర్‌ హిట్‌ని సొంతం చేసుకొని ఎన్నో రికార్డులను సాధించిన విషయం తెలిసిందే.