TG Politics: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూపు 1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు

TG Politics: Good news for the unemployed.. Group 1, 2, 3 exam dates are finalised.
TG Politics: Good news for the unemployed.. Group 1, 2, 3 exam dates are finalised.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత TSPSC ని ప్రక్షాళన చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు పరీక్ష జరిగి రద్దు అయిన గ్రూపు 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా పోస్టులను యాడ్ చేసిన విషయం తెలిసిందే. గ్రూపు2, గ్రూపు 3 పరీక్షలు ఎప్పుడు ఎప్పుడు అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తాజాగా TSPSC గుడ్ న్యూస్ చెప్పింది.

గ్రూపు 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల తేదీలను తాజాగా ప్రకటించింది TSPSC. ఆగస్టు 7,8 తేదీలలో గ్రూపు 2 పరీక్షలు జరుగనుండగా.. అక్టోబర్ 21 నుంచి గ్రూపు 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపింది. నవంబర్ 17, 18 తేదీలలో గ్రూపు 3 పరీక్షలు నిర్వహించనున్నట్టు TSPSC తెలిపింది. గ్రూపు 1లో 563, గ్రూపు 2లో 783, గ్రూపు 3లో 1388 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక నిరుద్యోగులు పరీక్షలకు సన్నద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విషయం తెలిసిందే.