దళపతితో సేతుపతి

దళపతితో సేతుపతి

దళపతి విజయ్ కథానాయకుడుగా,విజయ్ సేతుపతి ప్రతినాయకుడుగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది.ఎక్స్‌బీఫిలింస్‌ క్రియేషన్స్‌ పతాకంపై జవీర్‌బ్రింటో నిర్మించనున్న ఈచిత్రంలో బాలీవుడ్‌బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‌గా నటింస్తున్నారని ప్రచారం.

దళపతి విజయ్‌ నటిస్తున్న 64వ చిత్రానికి విలన్‌గా నటుడు విజయ్‌సేతుపతి నటించనున్న విషయాన్ని అధికారికంగా చిత్రయూనిట్ తెలిపింది.కోలీవుడ్‌లో హీరోగా మంచిపేరుసంపాదించుకున్న విజయ్‌సేతుపతి ఈ చిత్రానికి పారితోషికం బాగానే తీసుకుంటున్నారని తెల్సింది.సైరా నరసింహారెడ్డి చిత్రంలో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతి పాత్రలో వైవిధ్యం ఉంటే ఏ పాత్ర అయిన చేయవచ్చు అని పేర్కొన్నారు.