ఆ సినిమాలు కలిపికొట్టి సరిలేరు నీకెవ్వరూ అంటున్నారా ?

these films are correct

మ‌హర్షి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మ‌హేశ్ బాబు మంచి ఫాంలో ఉన్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్న మహేష్ అనిల్ రావిపూడితో తర్వాతి సినిమా చేయనున్నాడు. స‌రిలేరు నీకెవ్వ‌రు అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓపెనింగ్ కూడా జ‌రిగింది. ప్రస్తుతం ఈ సినిమా క‌థ ఇదే అంటూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కొన్ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో మ‌హేశ్ ఆర్మీ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి క‌న్ఫ‌ర్మేష‌న్ ఇచ్చాడు. పైగా టైటిల్లోనే అది చూపించాడు కూడా. ఇక అస‌లు విష‌యానికొస్తే ఈ చిత్రంలో ఫ్రెండ్ కోసం ఆర్మీ వ‌దిలేసి అత‌డి కుటుంబాన్ని ఆదుకోడానికి వ‌చ్చే పాత్ర‌లో మ‌హేశ్ న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఒక‌ప్పుడు వెంక‌టేశ్ వార‌సుడొచ్చాడు, మ‌హేశ్ బాబు అత‌డు సినిమాల‌ను కలిపి కొడితే ఎలా ఉంటుందో అలా స‌రిలేరు నీకెవ్వ‌రు క‌థ ఉంటుంద‌ని తెలుస్తుంది. కీల‌క‌మైన పాత్ర‌లో విజ‌యశాంతి న‌టించ‌బోతుంది. ర‌ష్మిక మంద‌న్న ఈ సినిమాలో హీరోయిన్. ఇక ఈమె కుటుంబం మ‌హేశ్ బాబును ఇందులో టార్చ‌ర్ పెడుతుంద‌ని అదే సినిమాకు కీ పాయింట్ ఆల్రెడీ ఈ పాయింట్ తో ఆగడు వచ్చింది. అయితే ఇది నిజమో కాదో అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే.